31-08-2025 12:13:09 AM
-ఎమ్మెల్యే ముఠా గోపాల్
-భోలక్‌పూర్ ఎస్‌బీఐ కాలనీలో అన్నదానం
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని ఎస్బిఐ కాల నీలో ప్రవీష యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్ర హం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, రహీం, మహమ్మద్ అలీ, ఆరిఫ్ ఉద్దీన్, అసోసియేషన్ ప్రతినిధులు సాయి ప్రణీత్, రంగనాథ్ గౌడ్, సాయి ప్రదీప్ గౌడ్, విష్ణు సాయి కిరణ్, సాయిలు, అభినవ్ సా యి, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక పూజలు చేసిన నగేష్ ముదిరాజ్..
ఖైరతాబాద్ మహా గణేశుడు విగ్రహం వద్ద శనివారం టిఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నా యకుడు నగేష్ ముదిరాజ్ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కు ల ను తీర్చుకున్నారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మహా గణేశుడిని వేడుకు న్నట్లు వెల్లడిం చారు. అనంతరం ఈ కార్యక్ర మంలో పలు వురు నాయకులు పాల్గొన్నారు.