calender_icon.png 9 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి

31-08-2025 12:11:20 AM

-రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు

-పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను సత్కరించిన కమిషనర్

రాచకొండ, ఆగస్టు 30 (విజయక్రాంతి): పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎం తో కాలం  పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా పని చేయడం వారి క్రమ క్రమశిక్షణ కు నిదర్శమని ఆయన  అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన నలుగురు ఉద్యోగులను కమీషనర్  సుధీర్ బాబు శనివారం నాడు  రాచకొండ పోలీస్ కార్యాలయంలో ఘనం గా సత్కరించారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లా డుతూ  పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలన్నారు. పదవీ విరమణ పొంది న నందు కుమార్, ఫింగర్ ప్రింట్ బ్యూరో,  అనంతయ్య, సబ్ ఇన్స్పెక్టర్, కంట్రోల్ రూమ్, మేఘమాల, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్,  సుబ్బా రెడ్డి, సిఏఆర్ అంబర్ పేట హెడ్ కానిస్టేబుల్‌లను పోలీస్ కమీషనర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, సీసీఆర్బీ ఏసిపి రమేష్, సిఎఓ అడ్మిన్ పుష్పరాజ్, ఎఎఓ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, కో ఆపరేటివ్ డైరెక్టర్ టేకుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.