calender_icon.png 8 May, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు షిప్టులలో పుష్కర పనులు జరగాలి.. లేదంటే శాఖ పరమైన చర్యలు

07-05-2025 06:57:27 PM

దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు అధికారులకు ఆదేశం...

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాలేశ్వరంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma), దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావుతో పరిశీలించారు. ఈ సందర్భంగా విఐపి ఘాట్‌లు, గోదావరి ఘాట్‌లు, టెంట్ సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 100 గదుల సత్రం, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేపు అన్న పదం వాడొద్దని సూచించారు.

ప్రతి రోజు చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నదని ప్రాధాన్యతను గమనించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ లో సీఎం పుష్కరాల ఏర్పాటు పనులను అడిగి తెలుసుకున్నారని, బాధ్యత తీసుకోవాలని సూచించారని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి సమస్య రావొద్దని, భక్తులు సంతోషంగా వచ్చి పుష్కర స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి విధులు కేటాయించి పర్యవేక్షణ చేయాలని వివరించారు.

అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రతి రోజు విఐపి, పీఠాధిపతులు వస్తారని తెలిపారు. మొట్టమొదటి సారిగా జాయ్ రైడ్, టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ను అభినందించారు. సివిల్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయని, లోపాలు రావొద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని చాలా కష్టపడి 24X7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకన జరుగుతున్నాయని, నిద్రావస్థలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు.  రైతుల భూమిని లీజుకు తీసుకుని విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక  రహదారి నిర్మిస్తున్నారని, పుష్కరాల ప్రాధాన్యత గుర్తించి భూమి ఇచ్చిన రైతులను అభినందించారు.

రెండు రోజుల్లో మంత్రి వస్తున్నారని, షేప్ మారాలని ఆదేశించారు. పారిశుధ్యం అద్వాన్నంగా ఉందని జడ్పి సీఈఓ పర్యవేక్షణ చేయాలని, పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యహరిస్తున్నారని సమన్వయంతో ఉండాలని సూచించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశామని అదే స్ఫూర్తితో సరస్వతి, పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రోడ్లు మరమ్మతులు చేయాలని, హెలిప్యాడ్ కో ఆర్డినేట్స్ పక్కాగా ఇవాలని సూచించారు. షవర్ పనులు పెండింగ్ ఉన్నాయని, అలాగే గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

మరుగుదొడ్లు చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్నాయని వేగం పెంచాలని సూచించారు. పుష్కరాలను మోడల్ గా చేయాలని ఇతర రాష్ట్రాల కు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు నుండి ప్రజా ప్రతినిధులు, న్యాయ వాదులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 12 రోజులు పాటు సందడిగా పండుగ వాతావరణంలో పుష్కరాలు జరగాలని ఆదేశించారు. విఐపి ఘాట్ రోడ్డు. బారికేడింగ్ చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేయాలని, పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని రోడ్లు మరమ్మతులు చేసి గుంతలు లేకుండా పూడ్చాలని పేర్కొన్నారు. ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ ఇంజినీరింగ్ శాఖల అధికారుల విధులు చాలా ముఖ్యమైనవని తెలిపారు.

పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్ళొద్దని, అంకితభావంతో పని చేయాలని తెలిపారు. ప్రతి రోజు 5 వేల మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 15వ ముఖ్యమంత్రి వస్తున్నారని,  సరస్వతి మాతా విగ్రహం ప్రారంభోత్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.  గ్రాండ్ మానర్ లో చేయాల్సిన అవసరం ఉందని, పారిశుధ్యం, మంచినీరు, మరుగుదొడ్లు, రహదారుల మరమ్మతులు, విఐపి ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారికి గ్రావెల్ వేయాలని తెలిపారు. ఇన్సినిరేటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.  5 సెక్టార్లు, 18 జోన్లు గా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

గోదావరిలో వైద్యుద్దీ కరణ చేయాలని తెలిపారు.  గోదావరిలో వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని తెలిపారు.  హారతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నందున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నోడల్ అధికారులు నియామకం ద్వారా పనులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.  12 మే వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  విఐపి ఘాట్ వద్ద విఐపిలకు షవర్స్, బట్టలు. మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హారతి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలోని ప్రదాన కూడళ్ళులో ఎల్ ఈ డి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ కిరణ్ కరే కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఆర్జేసి రామ కృష్ణారావు, ఇరిగేషన్, పీఆర్, ఆర్ డబ్ల్యూఎస్, దేవాదాయ, విద్యుత్తు,  వైద్య ఆరోగ్య శాఖ, డిఆర్డీఓ, సమాచార శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.