01-08-2025 12:00:00 AM
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీ ఉద్యమంలో అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుంటాం
ఘట్ కేసర్, జూలై 31: సమాజంలో బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలకు అన్యాయం జరుగతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రారంభమైన బీసీ ఉద్యమం దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కనువిప్పు కలిగిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ ఇదే అంశం చుట్టూ బతుకమ్మ ఆడుతున్నారని ఎద్దేవా చేశా రు.
గురువారం కొర్రెముల్ లోని జేకే కన్వెన్షన్ హాల్ లో బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ’బీసీ రాజ్యాధికార సాధనకు కార్యాచరణ సమావేశం’లో ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న, ఉద్యమ నాయకులు వీజీఆర్ నారగోని, సూర్యారావు, నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి గ్రామంలో రాజ్యాధికారంలో బీసీలకు రావాల్సిన వాటాపై చర్చ సాగుతోందన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండా కేవలం రాజ్యాధికారం కోసం బీసీ ఉద్యమం నడుస్తోం దన్నారు. అన్ని సంస్థల్లో వినిపిస్తున్న బీసీ నినాదం సింగరేణికి పాకిందన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలో బీసీ సెల్ ఉంటే, త్వరలో రాబోయే బీసీ పార్టీలో ఓసీ సెల్ ఉంటుందని చెప్పా రు. మీ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాలిలే కాల్చేస్తాం తప్ప పొత్తు పెట్టుకోమన్నారు.
బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన వారి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటామని ప్రశంసిస్తూనే వ్యతిరేకంగా పనిచేసిన వారిని తరిమి కొడతామని హెచ్చరించారు. మా వాటా మాకు ఇస్తే తీసు కుంటామని, లేదంటే గుంజుకుంటామని అన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే రాష్ట్రంలోని 22 టోల్ గేట్స్ వద్ద బైఠాయిస్తామన్నారు. ఇప్పటి రాజకీయ పార్టీలను బీసీలకు కిరాయి ఇళ్లతో పో ల్చారు.
2026 లో వచ్చే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఏవిధంగా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీసీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలం గాణను పెట్టుబడిదారులు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుంటామని హామీఇచ్చారు.తినబోతూ రుచి ఎందుకన్నట్లు బీసీ పార్టీ పేరును ఇప్పుడు చెప్పనన్నారు.