calender_icon.png 2 August, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమితలో ఘనంగా ‘ఏక్ పేడ్ మా కే నామ్’

01-08-2025 12:00:00 AM

కొత్తపల్లి, జూలై 31 (విజయ క్రాంతి):  పారమిత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గురువారం ‘ఏక్ పేడ్ మా కే నామ్‘ అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటి ప్రకృతి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాద రావు మొక్కలు నాటిన విద్యార్థులను అభినందిస్తూ వా రు నాటిన  ప్రతి మొక్క కూడా ఒక సజీవ జ్ఞాపకంగా నిలిచి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినింపాలని తెలిపారు.  ఈ కార్యక్రమం లో డైరెక్టర్స్  ప్రసూన,అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు,రమణ, వి.యు.యం. ప్రసాద్, హన్మంత రావు, పాఠశాలల ప్రధానోపాద్యాయులు గోపీకృష్ణ, సమన్వ య కర్తలు నాగరాజు, రాము, రబీంద్ర పాత్రో, భవానీ, నిఖిత, విద్యార్థులుపాల్గొన్నారు.