calender_icon.png 3 August, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ ఎమ్మెల్యేల రాజీనామా తప్పనిసరి

01-08-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును బీఆర్‌ఎస్ ఆహ్వానిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకా నంద అన్నారు. మూడు నెలల దాకా ఆగకుండా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకో వాలని, సుప్రీం తీర్పు మీద ఏ మాత్రం గౌరవమున్నా పది మంది ఎమ్మెల్యేలు రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు.

గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ.. సుప్రీం తాజా తీర్పు బీఆర్‌ఎస్ తొలి విజయమని, ఈ విజయ పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.