calender_icon.png 11 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమా డబ్బు ఇవ్వకపోతే ఉద్యమం తప్పదు

09-01-2026 12:00:00 AM

కేంద్రాన్ని హెచ్చరించిన యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్

ముషీరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): దేశంలో తిరిగి ఇవ్వని భీమా డబ్బులు కోట్ల రూపాయలు ఉన్నాయని యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్ తెలిపింది. రూ.9500 కోట్ల డబ్బును తిరిగి ఇవ్వాలని ఫౌండేషన్ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ కన్వీనర్ దిలీప్ కుమార్, సెక్రటరీ డా. సందీప్ రెడ్డి, తెలంగాణ ప్రతినిధి సంతోష్ లు మాట్లాడుతూ ఎంతో కష్టపడి జమ చేసుకొని బీమా సంస్థలకు చెల్లిస్తే అవి సకాలంలో క్లెయిమ్ కాక మానసింగా కుంగి అనారోగ్యానికి గురివుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ ప్రతినిధులు రాజిరెడ్డి, మల్లం వెంకటేష్ గౌడ్, అడ్వకేట్ స్రవంతి, విజయ్ ఆనంద్ పాల్గొన్నారు.