14-05-2025 01:19:45 AM
- సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు
భద్రాద్రి కొత్తగూడెం/మధిర, మే 13 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజల కు ఇచ్చిన హామీలను అమలుచేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయక తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు అన్నారు. మంగళవారం సిపిఐ మం డల కార్యదర్శి ఊట్ల కొండలరావు అధ్యక్షత న సిపిఐ మండల కౌన్సిల్ సమావేశం రెడ్డి గార్డెన్ లో జరిగింది.
ఈ కౌన్సిల్ సమావేశంలో ప్రజల ఎదుర్కొన్న సమస్యలు వాటి పై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్య లు,పార్టీ బలోపేతానికి భవిష్యత్తు కార్యాచరణ పై కౌన్సిల్ సమావేశంలో చర్చించా రు.ఈ సందర్భంగా బెజవాడ రవి బాబు మాట్లాడుతూ,సంక్షేమ పథకాలు ప్రతి పేదకుటుంబానికి చేరాలన్నదే కంమ్యూనిస్టు పా ర్టీ లక్ష్యమన్నారు.
అందుకోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు, ఇ తర సంక్షేమపథకాలకోసం దరఖాస్తు చేసుకున్న వారిపేర్లు రాజకీయాలకు అతీతంగా జాబితాలో చేర్చి పథకాలు అందించాలని, అధికారులు ఈ అంశంపై ప్రేత్యేక ద్రుష్టి సా రించాలన్నారు.
ఇప్పటికే ప్రజల వద్ద నుండి ప్రజాపాలన పేరిట ఒకసారి దరఖాస్తులు తీ సుకున్నారని కులగణన పేరిట మరోసారి వి వరాలు సేకరించారని ఆ తర్వాత గ్రామసభలు పెట్టి మరోసారి దరఖాస్తులు స్వీకరిం చారని దరఖాస్తుల తోనే కాలం గడిచిపోతుంది తప్ప పథకాలు ప్రజల వద్దకు చేరటం లేదని విమర్శించారు.
ఈ సమావేశంలో సి పిఐ జిల్లా నాయకులు ఎం.ఏ రహీం,ఏఐటియుసి డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంక టేశ్వరరావు,ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్,తలారి రమేష్,ఊట్ల రామకృష్ణ,జిల్లా బ్రహ్మం,పున్నవెల్లి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.