14-05-2025 04:14:28 PM
ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ స్టార్ ఇండియా బ్యాటింగ్ దిగ్గజాలు(Star India batting legends) విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ ఇప్పటికీ భారత క్రికెట్ లో భాగమేనని బీసీసీఐ(Board of Control for Cricket in India) వెల్లడించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Rohit Sharma )లకు 'ఏ ఫ్లస్' గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తామని ప్రకటించింది. 'ఏ ప్లస్' సౌకర్యాలన్నీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు కొనసాగించనున్నట్లు తెలిపింది. టీ 20, టెస్టులు ఆడనప్పటికీ ఇద్దరికీ 'ఏ ప్లస్' గ్రేడ్ కొనసాగిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్ దిగ్గజాలు తమ ఒప్పందంలో అందించబడిన అన్ని సేవలను పొందడం కొనసాగిస్తారని చెప్పారు. సాంప్రదాయకంగా, బీసీసీఐ మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చే ఆటగాళ్లకు A-ప్లస్ కాంట్రాక్టును అందజేస్తుంది. ప్రస్తుత సైకిల్‌లో, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను A-ప్లస్ కాంట్రాక్టులలో చేర్చారు. జూన్ 20 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనతో వారి ఆదర్శ ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి జట్టు యాజమాన్యానికి ఎక్కువ సమయం లేదు. అంతేకాకుండా, నాయకత్వ పాత్రను పోషించడానికి శుభ్‌మాన్ గిల్ ముందు వరుసలో ఉండటంతో టీమిండియా కొత్త కెప్టెన్ నేతృత్వంలోకి వెళ్లనుంది. గత సంవత్సరం జింబాబ్వే పర్యటనలో ఈ యువ ఆటగాడు T20I జట్టుకు నాయకత్వం వహించాడు. 2024 నుండి ఐపీఎల్(Indian Premier League)లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, ఇంగ్లాండ్ కఠినమైన పరిస్థితుల్లో టెస్ట్ కెప్టెన్‌గా గిల్ ఎలా రాణిస్తాడో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.