14-05-2025 03:50:28 PM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం(Union Cabinet meeting) ముగిసింది. సమావేశంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్(Union Minister Ashwini Vaishnaw) వెల్లడించారు. యూపీ(Uttar Pradesh)లోని జీవర్ లో ఆరో సెమీకండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 3706 కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు(Cabinet Approves Semiconductor Unit) ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ యూనిట్లు నిర్మాణం వేగంగా సాగుతోందని అశ్వినీవైష్ణవ్ తెలిపారు.
ఒక యూనిట్ లో ఉత్పత్తి ఈ ఏడాదిలోనే ప్రారంభం అవుతోందన్నారు. సెమీ కండక్టర్ యూనిట్(Semiconductor Unit) ఏర్పాటు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రమంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ల యూనిట్ లోనెలకు 3.6 కోట్ల చిప్ ల ఉత్పత్తి అవుతూందని చెప్పారు. హెచ్సీఎల్, ఫ్యాక్స్ కాన్ సంస్థల జాయింట్ వెంచర్ గా సెమీకండక్టర్ యూనిట్ ఉంటుందన్నారు. 270 వర్సిటీల్లో విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన 20 చిప్ లను మొహాలీలో ఉప్పత్తి చేశారని చెప్పారు. సెమీ కండక్టర్ల సాంకేతికతపై 70 స్టార్టప్ లు పనిచేస్తున్నాయని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారని సూచించారు. 2027లో వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభమవుతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.