calender_icon.png 12 August, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీమా చెక్కు అందజేసిన కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి

12-08-2025 07:30:44 PM

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల పరిధిలోని బిబిపేట్ గ్రామానికి చెందిన మంగలి బాలరాజు మరణించాడు. ఆయన రెండు సంవత్సరాలకు ముందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రెండు సంవత్సరాలు క్రితం 32700 ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ప్రమాదవశాత్తూ రెండు నెలల క్రితం మరణించినందున ఆయన భార్య మంగలి శివలీలకు 6,30,000 ప్రమాద బీమా చెక్కుని మంగళవారం బీబీపేట్ గ్రామంలో అందజేశారు.

ఈ చెక్కునీ కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి, రీజినల్ మేనేజర్ విజయ్ కుమార్ చేతుల భీమా చెక్కును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రతి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ భీమాతో కుటుంబానికి ధీమా అని అన్నారు. ప్రతి ఒక్కరూ భీమా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ సాయిలు, మాజీ ఎంపీపీ మల్లేశం, సిర్గాపూర్ తాజా మాజీ జడ్పీటీసీ రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు అనిల్ రెడ్డి, బండారి సాయిలు, డిఓలు ప్రకాష్, మహేందర్ గౌడ్, సంస్థ ఉద్యోగులు భైండ్ల అశోక్,పూర్ణ చందర్, బాలాజీ, మల్లేష్, సురేష్, సతీష్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.