24-10-2025 12:44:15 AM
పంట దిగుబడులు అంతంత మాత్రమే
ఆర్థిక సంక్షోభంలో అన్నదాత
రైతు పెట్టుబడిపై ఊసెత్తిని రాష్ట్ర ప్రభుత్వం
నిర్మల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్న ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన రైతులకు కాలం కలిసి రాలేదు. వానాకాలం పంటల సాగుపై ఎన్నో ఆశలు పెట్టుకొని పంట పెట్టుబడులు పెట్టిన అధిక వర్షాలు ఆపై వరదలు పంటకు తెగుళ్లు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
వర్షాలు వరదల వల్ల వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతు ఖాతాలో జమ కాలేదు. దీంతో జిల్లా రైతాం గం యాసంగి సాగుకు పంట పెట్టుబడులకు పైసలు లేక ప్రభుత్వ సాయం చేతికి రాక ప్రైవేటు వడ్డీ వ్యాపారాలుస్తులను ఆశ్రయించవలసి రావడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో వానాకాలం సీజన్లో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు.
ఇందులో పత్తి 1/44 లక్షల ఎకరాలు, సోయా 1.20 లక్షల ఎకరాలు, వరి 1,10,000 ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా మిగతాది పసుపు జొన్న పప్పు దినుసులు కూరగాయ పంటలు ఉన్నాయి జూన్ మాసంలో విత్తనాలను వేసుకొని పంటలు సాగు చేయగా ఎదుగుతున్న దశలో అధిక వర్షాలు అనుకోని తెగుళ్లు వరదలు వివిధ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపటంతో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు
అందని ప్రభుత్వ సాయం...
నిర్మల్ జిల్లాలో వానకాల సీజన్లో వివిధ పంటలు సాగు చేసిన రైతులకు ఈసారి కాలం కలిసి రాకపోగా వరదలు వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంట సోయపంట వరి పంట సాగు చేసే ప్రాంతాల్లో బాసర గోదావరి తో పాటు నదులు చెరువుల కింద అధిక వర్షాల వల్ల వరదలు ఏర్పడి సుమారు 19 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు.
అధిక వర్షాల వల్ల వరదలకు పంట కొట్టుకోవడం పూతకు గురికావడం పూత ఖాతా రాలిపోవడం హేమ శాతం పెరిగి తెగుళ్లు సోకడం వరుద ద నీటిలో ఉండడంవల్ల పంట మునిగిపోయి పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం లేదని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకు ఎకరానికి 15 వేల పైగా పెట్టుబడి పెట్టామని ప్రస్తుతం రెండు నుంచి మూడు కుంటల మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు వాపోతున్నారు.
ఎకరానికి ఎనిమిది క్వింటాలు వచ్చే సోదిగుబడి ప్రస్తుతం నాలుగు క్వింటాలకు మించి రావడం లేదు. మొక్కజొన్న వరి పంటలు కూడా దెబ్బ తినడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు పండించిన పంటకు ప్రభుత్వ కొనుగోలు లేక వర్షాల వల్ల పంట దెబ్బతినడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించడం వల్ల మద్దతు ధర పొందలేక తీవ్ర నష్టాలకు కష్టాలకు గురవుతున్నారు.
జిల్లాలో ఇప్పటికీ సోయ కొనుగోలు పత్తి కొనుగోలు ప్రారం భం కాకపోవడంతో రైతులు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. అక్టోబర్ మాసంలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో సోయా మొక్కజొన్న ఇతర పంటలు సాగు చేసిన వారు రెండో పంట సాగు చేయడానికి చేతిలో పెట్టుబడి లేక ప్రభుత్వ సహాయం అందగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పెట్టుబడి సాయమేది?
నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు పంటలు అంతంత మాత్రంగానే దిగుబడి రావడంతో యాసంగి సీజన్కు అవసరమయ్యే పెట్టుబడులేక రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించి పంట నష్టం వివరాలను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించారు. జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లలో సుమారు 19 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్టు నివేదిక అందించారు.
వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రులు అధికారులు ప్రభుత్వం ద్వారా ఎకరానికి 10000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించడం లేదని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతుంది. దీనికి తోడు ప్రభుత్వం యాసంగి సీజన్ కు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 12000 రైతు భరోసా నిధులను అక్టోబర్ మాసంలో విడుదల చేయవలసి ఉంటుంది.
జిల్లాలో 1.89.236 మంది రైతులకు సుమారు రూ. 228.16 కోట్లు అందిం చవలసిన ఇప్పటివరకు రైతు భరోసా నిధులపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వకపోవడంతో రైతు భరోసా నిధులు వస్తాయో లేదో అన్న బెంగ జిల్లా రైతాంగంలో నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పదివేల పరిహారంతో పాటు రైతు పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులను తక్షణం విడుదల చేస్తేనే యాసంగి సీజన్ కు రైతులకు పెట్టుబడికి ఇబ్బంది ఉండదు.
వానకాలం సీజన్లో రైతుల చేతికొచ్చిన సోయా మొక్కజొన్న పత్తి పంటల పెట్టుబడి ఖర్చులకి సరిపోవడంతో యాసంగిలో దుక్కులు దున్ని విత్తనాలు ఎరువులు ఇతర ఖర్చులకు రైతు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జిల్లాలోని రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారంతోపాటు రైతు భరోసా నిధులను అందించి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.