calender_icon.png 24 October, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపతండా పాఠశాలలో నల్లా ఏర్పాటు

24-10-2025 12:42:37 AM

మోతె, అక్టోబర్ 23 : మండల పరిధిలోని గోపతండ మండల పరిషత్ ప్రాథమిక  పాఠశాలలో విద్యార్థుల అవసర నిమిత్తం ఏర్పాటు చేయబడిన మంచినీటి ట్యాంకు గ్రామపంచాయతీ సిబ్బంది వెలుపల వైపు నల్ల ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో విజయక్రాంతి మురుగు కాల్వలో నల్ల విద్యార్థుల ఆరోగ్యం గుల్ల అనే కథనాన్ని ప్రచురించింది దీంతో మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావు స్పందించి గురువారం పాఠశాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ట్యాంకుకు వెలుపల వైపున మురుగు కాలువలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందిని పిలిపించి వెలుపల వైపు ఉన్న నల్ల తొలగించి పాఠశాల లోపట వైపు ఏర్పాటు చేయించారు. దీనితో విద్యార్థుల సమస్య తొలగినట్టు అయింది పాఠశాల మౌలిక వసతుల కల్పనలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పాఠశాల ఉపాధ్యాయులను ఎం ఈ ఓ ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. కాగా విద్యార్థుల సమస్యను తీర్చారంటూ విజయ క్రాంతి దినపత్రికకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.