calender_icon.png 1 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకత్వానికి ప్రతీక వల్లభాయ్ పటేల్

01-11-2025 12:19:16 AM

  1.   560 సంస్థానాలను సమైక్యపరచి అఖండ భారతాన్ని నిర్మించాడు
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
  3. పటేల్ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో రన్ ఫర్ యూనిటీ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (విజయక్రాంతి): భారత ఏకత్వానికి ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, 560 సంస్థానాలను సమైక్యపరచి అఖండ భారతాన్ని నిర్మించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఫతే మైదాన్, బషీర్‌బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ప్రారంభించారు.

అక్కడి నుంచి అసెంబ్లీ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ క్రాస్ రోడ్ వద్ద పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడు తూ.. “ఏడాది పొడవునా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయి.

కేంద్రం నుంచి రాష్ట్రం వరకు, పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, రైతు నుంచి స్వాతంత్య్ర సమరయోధుడి వరకు  ప్రతి భారతీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో భాగస్వామిగా ఉండబోతున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. గుజరాత్‌లో రైతు ఉద్యమ నాయకుడిగా ప్రజల మనసుల్లో నిలిచారు. కానీ కాం గ్రెస్ పార్టీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు, లేదా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు లాంటి నాయకులు నచ్చరు.

వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తు ఉండరు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి దేశభక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తక్కువ చేసి చూ సింది. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడిన వీరులందరినీ చరిత్రలో నిలిచేలా చేయడం నవతరానికి వారి త్యాగాలను తెలియజేయడం భారత ప్రభుత్వం చేపట్టిన గొ ప్ప కర్తవ్యం” అన్నారు.

వల్లభాయ్ పటేల్ చొ రవతోనే తెలంగాణ గడ్డపై భారత త్రివర్ణ పతాకం ఎగిరిందని చెప్పారు. రజాకార్లు ఊర్లపై దాడులు చేస్తున్న సమయంలో, సర్దార్ భా రత సైన్యాన్ని పంపించి నిజాం ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణకు స్వాతం త్య్రం తీసుకువచ్చారని చెప్పారు. 

పటేల్‌వి ధైర్య నిర్ణయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ.. “సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడు. భారతదేశపు మొదటి హోంశాఖ మంత్రిగా, ఆయన కృషితోనే దేశంలోని దాదాపు 560 సంస్థానాలను సమైక్యపరచి, అఖండ భారతాన్ని నిర్మించారు. హైదరాబాద్ రాష్ట్రం ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైందంటే  అది కూడా సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పం, ధైర్య నిర్ణయాల ఫలితం. 

నిరంకుశ నిజాం పాలనకు ముగింపు పలికేందుకు ‘పోలీస్ యాక్షన్’ తర్వాత హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. సర్దాల్ వల్లభాయ్ పటేల్ జీవితం, సేవలు ప్రతి యువతకు ప్రేరణ” అని అన్నారు. సర్దార్ పటేల్ మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా దేశ అఖండతను కాపాడుతూ, ఉగ్రవాదంపై దృఢ చర్యలు తీసు కుంటున్నారు అని చెప్పారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్ర ఐటీ మరి యు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, శాసనస మండలి పక్ష నాయకులు ఏవీయన్‌రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.