సేవకుడిగా పనిచేస్తా.. ఎన్నికల్లో గెలిపించండి
వినోద్‌కుమార్, బండి సంజయ్ తోడు దొంగలు
ఎన్నికల్లో వారిపై భారీ మెజార్టీతో గెలుస్తా..
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు
కరీంనగర్ సిటీ, మే 5: లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే ఐదేళ్లపాటు సేవకుడి పనిచేస్తానని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని తన స్వగృ హంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఎంపీలకు కేంద్రం నుంచి ఏటా రూ.5 కోట్లు మంజూరవుతాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులతోపాటు రూ.15 కోట్ల సొంత నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతానన్నా రు. యంత్ర చేయూత పేరుతో ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ తీసుకువస్తామ న్నారు. యువత కోసం ఇంటర్నేషనల్ లెవల్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానన్నారు.
మెరిట్ సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పారితోషికాలు అం దించి ప్రోత్సహిస్తానన్నారు. కరీంనగర్ నుంచి ఒక్కరినైనా ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలోకి పంపించడమే తన ధ్యేయమన్నా రు. సిరిసిల్ల నేత కార్మికులను ట్రేడింగ్ వైపు మళ్లించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఫోన్‌ట్యాపింగ్ అంశంపై స్పంది స్తూ.. స్కాంను వెలికి తీసిందే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రస్తుతం పారదర్శకంగా విచారణ జరుగుతున్నదన్నారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల్లో వణుకు మొదలైందన్నారు. నిందితుడు ప్రభాకర్‌రావు తన స్నేహితుడి వియ్యంకుడని, తనకు ఎందుకు సొమ్ము ఇస్తాడని ప్రశ్నించారు. బండి సంజయ్, బీ వినోద్‌కుమార్ స్మార్ట్ సిటీ నిధుల్లో 30 శాతం డబ్బును కాజేశారని ఆరోపించారు. వారిపై తాను భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.




