calender_icon.png 21 May, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఎఫ్‌ఎస్ ఫలితాలు విడుదల

21-05-2025 12:48:22 AM

  1. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు 
  2. నిఖిల్‌రెడ్డికి 11, ఐశ్వర్యారెడ్డికి 13వ ర్యాంకు
  3. 55లోపు ర్యాంకుల్లో మరో నలుగురు

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)-2024 ఫలితాలను మంగళవా రం విడుదల చేసింది. మొత్తం 150 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామకపరీక్షలో 143 మం దితో కూడిన ఎంపికైన వారి జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఫలితా ల్లో జాతీయ స్థాయి లో కనిక అనభ్ మొ దటి ర్యాంకు సాధించగా, తెలుగు రాష్ట్రా లకు చెందిన పలువురు విద్యార్థులు టాప్ 20 ర్యాంకుల్లో సత్తాచాటారు.

అంతేకాకుండా ఆపై ర్యాంకుల్లోనూ మన విద్యార్థులుండటం విశేషం. మిర్యాలగూడకు చెందిన చాడ నిఖిల్‌రెడ్డికి 11వ ర్యాంకు, యెడుగూరి ఐశ్వర్యారెడ్డికి 13వ ర్యాంకు వచ్చాయి. అలాగే చేరూరి అవినాష్‌రెడ్డికి 40వ ర్యాంకు, చింతకాయల లవకుమార్‌కు 49వ ర్యాంకు, అట్ల తరుణ్‌తేజకు 53, ఆలపాటి గోపీనాథ్‌కు 55వ ర్యాంకు దక్కింది. గతేడాది జూన్ 16న ఐఎఫ్‌ఎస్ ప్రాథమిక పరీక్ష నిర్వహించారు.

నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1వరకు మె యిన్స్, ఏప్రిల్ 21 నుంచి మే 2 వరకు పర్సనాలిటీ టెస్టులు నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 143 మందిని ఎంపిక చేసినవారిలో 40 మంది జనరల్ కేటగిరీ, 19 మంది ఈడబ్ల్యూఎస్, 50 మంది ఓబీసీ, 23 మంది ఎస్సీ, 11 మంది ఎస్టీ విభాగం కింద ఎంపికైనట్లు ప్రకటించారు.

కనికా అనభ్, ఖండే ల్వాల్ ఆనంద్ అనిల్ కుమార్, అనుభవ్ సింగ్, జైన్ సిద్ధార్థ్, మంజునాథ్ శివప్ప, ఎస్.విజయ్, మయాంక్ష పురోహిత్, శానిష్ కుమార్ సింగ్, అంజలి సోంధియా, సత్యప్రకాశ్ టాప్ టెన్‌లో ఉన్నారు.