25-08-2025 04:18:44 PM
ముత్తారం (విజయక్రాంతి): మండలంలోని పోతారం గ్రామంలో ఐకెపి బుక్ కీపర్ జంగిటి తిరుపతి తండ్రి రాములు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందగా, సోమవారం వారి పార్థివదేహానికి ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్యలు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోతారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్ర మల్లయ్య, మాజీ ఎంపీటీసీలు బండ సమ్మయ్య, నెత్తెట్ల భారత లక్ష్మి కొమురయ్య, కాంగ్రెస్ నాయకులు చెల్కల ఓదెలు, కోటగిరి శ్రీశైలం, నర్ర రాజేష్, చెల్కల నరేందర్, కిషన్, నెత్తెట్ల శ్రావణ్, రమేష్, ఇట్టం గట్టయ్య, బత్తుల మల్లయ్య తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.