calender_icon.png 25 August, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంబరాలు

25-08-2025 03:12:59 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గత కొన్ని రోజులుగా వేగంగా జరుగుతున్నాయి. కాగా, వలిగొండ మండల కేంద్రంలో పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు నూతన ఇండ్ల నిర్మాణంలో భాగంగా సోమవారం మామిడి తోరణాలు అలంకరించి గడపలను ఏర్పాటు చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.