25-08-2025 03:10:42 PM
వలిగొండ (విజయక్రాంతి): స్థానిక సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం వలిగొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బోళ్ల సుదర్శన్(BJP Mandal Party President Bolla Sudarshan) మాట్లాడుతూ, వలిగొండ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ విస్తంగా ఉందని వీధి దీపాలు వెలగడం లేదని కొన్ని వార్డులలో మంచినీరు రోజుల తరబడి రావడం లేదని అన్నారు. ఈ ధర్నాకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నరోత్తం రెడ్డి హాజరై మాట్లాడుతూ, మండల మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలే చంద్రశేఖర్, బంధారపు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.