calender_icon.png 21 May, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్

21-05-2025 12:27:32 AM

-ముల్లన్‌పూర్‌లో ప్లేఆఫ్ మ్యాచ్‌లు

- చెన్నైపై రాజస్థాన్ విజయం

ముంబై, మే 20: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మారుస్తూ బీసీసీఐ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ పరిస్థితుల రిత్యా మ్యాచ్ వేదికలను మారుస్తున్న ట్టు బీసీసీఐ తెలిపింది. వాస్తవానికి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఫైనల్ సహా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు, హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఒక ప్లేఆఫ్ మ్యాచ్ జరగాల్సి ఉంది.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో వచ్చే వారంలో పశ్చిమ బెంగాల్ సహా దక్షిణాది ప్రాంతంలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే 29, మే 30 తేదీల్లో జ రగనున్న క్వాలిఫయర్ ఎలిమినేటర్ మ్యాచ్ లకు ముల్లన్‌పూర్ వేదికగా కానుండ గా.. జూన్ 1న జరిగే క్వాలిఫయర్ పా టు జూన్ 3న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. 

మంగళవా రం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 17.1 ఓవర్లలో 4 వికె ట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.