25-08-2025 04:28:31 PM
కలెక్టర్ కు వినతిపత్రంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్..
మంథని (విజయక్రాంతి): మంథని ఎస్సీ బాలికల ఎస్ఎంహెచ్ హాస్టల్ వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్(DYFI District President Gorrenkala Suresh) సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha)కు వినతిపత్రం అందించారు. మంథని మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల(ఎస్ఎంఎస్) హాస్టల్ లో గత రెండు సంవత్సరాల నుండి వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తూ హాస్టల్లో విద్యార్థుల సంఖ్యను పెంచకుండా విద్యార్థులు హాస్టల్లో ప్రవేశం పొందడం లేదనే నెపంతో హాస్టల్లో ప్రవేశం పొందిన విద్యార్థులను వార్డెన్ ఇష్టమైన రీతిలో తిట్టడం వలన గత సంవత్సరంలో హాస్టల్లో చేరిన విద్యార్థులు టీసీలు తీసుకొని వేరే హాస్టల్ లో చేరడం జరిగిందని సురేష్ తెలిపారు.
అదేవిధంగా గతంలో గోదావరిఖనిలోని హాస్టల్ లో విధులు నిర్వహిస్తే అక్కడ ఉన్న హాస్టల్ ను కూడా మూసివేంచారని, ప్రస్తుతం మంథని ఎస్సీ బాలికల(ఎస్ఎంఎస్) హాస్టల్ లో ఒక విద్యార్థినిని కూడా చేర్చుకోకుండా హాస్టల్ ను మూసివేయలేనే ఆలోచనతో ఏ ఒక్క కాలేజీ విద్యార్థినికి కూడా హాస్టల్ లో ప్రవేశం ఇవ్వలేదని, గత రెండు సంవత్సరాల నుండి విధులు నిర్వర్తిన్నానని చెప్పి జీతం తీసుకుంటు ఏమాత్రం ఉద్యోగానికి న్యాయం చేయకుండా వ్యవహరించడం జరుగుతుందని, ఇలాంటి విషయాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే వార్డెన్ హాస్టల్ ను మూసివేయడం జరిగిందని, కావున ఇట్టి హాస్టల్ వార్డెన్ పైన సంబంధిత అధికారులపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.