25-08-2025 03:08:09 PM
సిద్దిపేట రూరల్: యూరియా కొరకు కిలోమీటర్ పొడుగునా గంటల తరబడి క్యూ లైన్లో రైతులు నిల్చున్నారు. పూల్లూరు రైతువేదికగా యూరియా ఇస్తున్నట్టు సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఒకేసారి వచ్చి చేరడంతో యూరియా తక్కువ ఉండడంతో అధికారులు ఒక్కరికి రెండు బస్తాలు ఇస్తున్నామని చెప్పడంతో వరి నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్న రెండు బస్తాలు ఏం చేసుకుకోవాలి అని రైతులు ఆందోళన చేశారు. వ్యవసాయ అధికారులు రైతులను సముదాయించి అందరికి వచ్చేలా చూస్తామని చెప్పి యూరియా పంపిణి చేశారు.