25-08-2025 03:37:55 PM
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్(Deputy Tahsildar Manideep)ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్ లో బర్త్ డే వేడుకల్లో యువకులు డ్రగ్స్ సేవించారు. డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో కీలక నిందితుడు విక్రమ్ రెడ్డి, మరో ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు విక్రమ్ రెడ్డి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్నాడు. బర్త్ డే పార్టీ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించగా, 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండీఎంఏ, 20 డ్రగ్స్ మాత్రాలు పోలీసులు స్వాధీనపరచుకున్నారు. డ్రగ్ టెస్టులో అందరికి పాజిటివ్ నిర్థారణ అయిందని పోలీసులు తెలిపారు.