06-12-2024 01:02:52 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాల అండ్ యాంబిషన్స్ కెరీర్ కౌన్సిలర్ సంస్థ సం యుక్త ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో నగరంలోని లకిడీకపూల్ వాసవీ కల్యాణ మండపంలో బిజినెస్ స్కూల్ ఫెయిర్ అండ్ ఎంబీఏ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్టు ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపాల్ రఘువీర్ తెలిపారు. కళాశాలలో గురువారం ఎక్స్‌పో పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎక్స్‌పో ద్వారా డిగ్రీ అనంతరం చేయబోయే కోర్సులపై విద్యార్థులకు మరింత అవగాహన కలుగుతుందన్నారు. దేశ విదేశాలకు చెందిన బిజినెస్ స్కూల్స్ యాజమాన్యాలు పాల్గొంటాయన్నారు.