06-12-2024 01:04:24 AM
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): జైళ్లలోని ఖైదీల్లో పరివర్తిన తీసుకురావాలని, వారిని సంస్కరించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆయన చంచల్‌గూడ జైలులో 92 మంది జైల్ వార్డర్స్‌కు మెడల్స్ బహూకరించి మాట్లాడారు.
పాసింగ్ ఔట్ పరేడ్ తీసుకుంటున్న వారు ఖైదీల సంరక్షణపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల 249 మంది సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేసిందన్నారు. మంత్రి తర్వాత జైలు ఆవరణలో మై నేషన్ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా పాల్గొన్నారు.