27-11-2025 06:58:10 PM
- హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ
- సభకు ప్రతి జర్నలిస్టుకు ఆహ్వానం
- విలేకరుల సమావేశంలో మహాసభ కన్వీనర్ కేఏ విజయరాజు
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఈనెల 29న (శనివారం) టియుడబ్ల్యూ జే (ఐజేయు) మహబూబ్నగర్ జిల్లా మహాసభలు భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని మహాసభల కన్వీనర్ కే ఏ విజయ రాజు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహాసభకు రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణతో పాటు మహబూబ్నగర్ జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నం శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత నిర్వహించే మూడవ జిల్లా మహాసభను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శివం కన్వెన్షన్ హాల్లో ఉదయం 10గంటల నుంచి కార్యక్రమం ఆరంభం అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ విచ్చేసి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.