calender_icon.png 27 November, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఆటల పోటీలు.. బహుమతులు..

27-11-2025 06:59:57 PM

బెల్లంపల్లి అర్బన్: ఎల్టా మండల స్థాయి పోటీలు తాండూరు జడ్పీహెచ్ఎస్ లో బుధవారం నిర్వహించారు. ఆటల పోటీల్లో భాగంగా ఉపన్యాస, వ్రాతపూర్వక పోటీలు నిర్వహించారు. దీనిలో సీనియర్ విభాగం రాత పరీక్ష మొదటి స్థానంలో తాండూరు విద్యార్థిని తేజస్వి రెండవ స్థానం, రేచిని పాఠశాలలోని అశ్వర్ధ అనే విద్యార్థి కి ఉపన్యాస పోటీలో మొదటి బహుమతి, తాండూరు జడ్పీ హెచ్ఎస్ తేజస్విని రెండవ బహుమతి, ఫర్హాన్ జూనియర్ విభాగం నుండి జడ్.పి.హెచ్.ఎస్ రేచిని నుండి అమూల్య అనే విద్యార్థికి ఉపన్యాస పోటీలో రాత పరీక్షలో మొదటి, రెండవ స్థానంలో నిలిచారు.

కేజీబీవీ పాఠశాల విద్యార్థులు  మొదటి, ద్వితీయ బహుమతులు సాధించారు. వచ్చే నెలలో మంచిర్యాలలో జరిగే జిల్లా స్థాయి పోటీలలో విజేతలు పాల్గొంటారు. గెలిచిన విద్యార్థులను తాండూరు జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అభినందించారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు అశోక్ జడ్.పి.హెచ్.ఎస్ రేచిని పాఠశాల ఉపాధ్యాయులు బట్టారి వెంకటేశ్వర్లు, రవిబాబు, సంతోష్, మురళి తదితరులు పాల్గొన్నారు.