27-11-2025 06:54:44 PM
ముకరంపుర (విజయక్రాంతి): రెడ్డి కార్పొరేషన్ కు వెంటనే నిధులు మంజూరు చేసి పాలకవర్గాన్ని నియమించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతుండగా రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, రాష్ట్ర నాయకులు బండ గోపాల్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దొంగల బాపురెడ్డి, నాయకులు గోగురు బాపురెడ్డి, కొండి రాజిరెడ్డి, ద్యావ భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.