07-08-2024 12:05:00 AM
కూల్చివేసిన హైడ్రా బృందాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (విజయక్రాంతి): చెరువు స్థలాలను ఆక్రమించి ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. గాజుల రామారం గ్రామం దేవేందర్ నగర్ కాలనీ పరిధిలోని చింతల చెరువుకు సంబంధించిన 44.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు మంగళవారం కూల్చివేశారు. అక్రమ నిర్మాణాల విషయం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దృష్టికి వెళ్లడంతో చర్యలు ప్రారంభించారు. అధికారుల ఆదేశాల మేరకు ఆర్‌ఎఫ్‌వో పాపయ్య నేతృత్వంలో డీఎస్పీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ బాల్‌రెడ్డి సహకారంతో హైడ్రా విభాగం మార్షల్స్, డీఆర్‌ఎఫ్ బృందాలతో నిర్మాణాలను పూర్తిగా తొలగించారు.