07-08-2024 12:05:00 AM
ఏర్పాటు చేసిన ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): వర్షాల ప్రభావం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులకు సాయం అందిం చేందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసినట్టు ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే డైరెక్టర్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. 158 కిలోమీటర్ల పొడవైన ఓఆర్‌ఆర్‌పై ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతమైన నిర్వహణ చర్యలను చేపట్టామని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడిం చారు. ఔటర్‌పై అత్యవసర వేళల్లో హెల్ప్ లైన్ నంబర్లు 14449, 18005996699ను సంప్రదించాలని కోరారు. వర్షపు నీటి డ్రైన్లు, వెంట్స్ శుభ్రం చేయడం, పోర్టబుల్ వాటర్ పంపులను ఇన్‌స్టాల్ చేయడం మొదలైన చర్యలను సైతం తీసుకున్నట్టు వివరించారు.
భారీ వర్షాలు కురిసినా రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వివరించారు. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్), రాష్ర్ట విపత్తు నిర్వహణ బృందం, పోలీసు అధికారులు, అటవీ అధికారులతో సహకారంలో ఔటర్‌పై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఓఆర్‌ఆర్‌పై వివిధ ప్రదేశాల్లో డిజిటల్ మెసేజింగ్ బోర్డులపై వాతావరణ హెచ్చరికలను తెలుపుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్ ప్రెస్ వే సంస్థ ఓఆర్‌ఆర్‌పై 30 ఏళ్ల పాటు టోల్ నిర్వహణను గత ఏడాది చేపట్టిన సంగతి తెలిసిందే.