calender_icon.png 23 July, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల దాహార్తి తీర్చడం.. మూసీ ప్రక్షాళన లక్ష్యం

07-08-2024 12:05:00 AM

  1. ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.5,560 కోట్లు కేటాయింపు 
  2. మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో,  ఆగస్టు 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ బాధ్యతలు నిర్వహించే జలమండలికి ఇటీవల బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. జలమండలికి, నగరవాసులకు మరో తీపి కబురు చెప్పింది. నగరవాసుల తాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్ పనులకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. ఈ రెండో దశ పనుల కోసం రూ.5,560 కోట్లు కేటాయించింది.

ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మంగళవారం జీవో ఆర్‌టీ నంబర్ 345ను జారీ చేశారు. కాగా ఈ నిధులకు తోడు ఇటీవల బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కలిపి మొత్తం జలమండలికి ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి రూ.9,410 కోట్లు కేటాయించారు. జలమండలికి ప్రభుత్వం నుంచి ఇంత భారీ మొత్తం నిధులు కేటాయించడం పదేళ్లలో ఇదే ప్రథమం.

అదనపు జలాల తరలింపు.. 

గోదావరి తాగునీటి సరఫరా ఫేజ్ పనుల ద్వారా నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను పునరుజ్జీవనం కల్పించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని ప్రత్యామ్నాయాల ద్వారా 580 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్ డే)ల నుంచి 600 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. కాగా, రోజురోజుకు నీటి అవసరాలు పెరుగుతున్న దృష్ట్యా 2030 నాటికి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరో 170 ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గోదావరి నుంచి 30 టీఎంసీల నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం ఫేజ్‌x పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారుల అంచనా ప్రకారం హైద రాబాద్ నగర తాగునీటి డిమాండ్ 2030 నాటికి 750 ఎంజీడీ, 2050 నాటికి 1014 ఎంజీడీలకు పెరుగుతుంది. అందులో భా గంగానే ఫేజ్  పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

తాగునీటి అవసరాలు.. మూసీ నది ప్రక్షాళన కోసం 

గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్  పనుల్లో భాగంగా నగర నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీటిని తరలిస్తోంది. తాజాగా పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోగా.. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా జంటజలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మరో 5 టీఎంసీలను ఉపయోగించబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో నగర ప్రజల దాహార్తి తీర్చడం, మూసీనది ప్రక్షాళన కోసం కూడా చర్యలు తీసుకోబోతున్నారు. 

రెండేళ్లలో పూర్తి..

ఫేజ్‌టీ పనులకు సంబంధించిన డీపీఆర్‌ను వాప్కోస్ (డబ్ల్యూఏపీసీవోఎస్) అనే కంపెనీ సిద్ధం చేసింది. ఇందులో పంప్‌హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 3600 ఎంఎం డయా భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 780 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. కాగా, గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్  ద్వారా 163 ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది.