16-08-2024 04:16:25 PM
అడ్డుకుంటున్న దేవాదాయ సిబ్బందిపై ఎదురు దాడి
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి చెందిన దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. పురుషోత్తం పట్టణంలో గల దేవాదాయ భూముల్లో కొందరు ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఈవో ఎల్ రమాదేవి తన సిబ్బందితో శుక్రవారం పురుషోత్తం పట్నం వెళ్లి అక్రమ నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆక్రమణదారులు దేవాదాయ ధర్మాదాయ సిబ్బందిపై ఎదురుదాడి దిగి నిర్మాణాలను అడ్డుకుంటున్న వారితో వాగ్వాదానికి దిగారు.