16-08-2024 03:36:01 PM
మంచిర్యాల: చెన్నూరు నియోజవర్గం కోటపల్లి మండలంలోని పారుపల్లి గ్రామంలో కొలువైన కాల భైరవ స్వామినీ శ్రావణ శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి దర్శించుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో ఉండాలని కోరుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వేమనపల్లి మాజీ జెడ్పిటిసి రుద్రభట్ల సంతోష్ కుమార్, వేమనపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ ఆలీ, పారుపేల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.