calender_icon.png 13 May, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్డ్‌వేర్, సీలింగ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు

12-05-2025 12:49:59 AM

  1. మున్సిపల్ అనుమతులపై పలువురి అభ్యంతరం
  2. తమకూ అనుమతివ్వాలని పలువురి ఆందోళన
  3. ఇంజాపూర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు
  4. పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు

తుర్కయంజాల్, మే 11: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్  మున్సిపాలిటీలో  అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో  అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.  స్థానిక రాజకీయ నేతల ప్రమేయం ఎక్కువ కావడంతో అధికారులు మిన్నకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇంజాపూర్ లోని 186 సర్వే నెంబర్ లో నలుగురు వ్యక్తులు అక్రమంగా ఇళ్లను నిర్మిస్తున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయాడు. అటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇటు మున్సిపల్ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడ కపోవడంతో  యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ ఉండడం విశేషం.

పోరంబోకు భూమి కావడంతో స్థానికులు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదంటున్నారు. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొద లు పెట్టారు. దీంతో పాటు దేవాదాయ భూమిలో పెద్ద ఎత్తున షెడ్లు వెలిసినా ఇప్పటివరకు దానివైపు తొంగిచూసిన పాపాన పోలేదు అధికారులు. 

ఇక, ఎంఎం కుంటలోని హార్డ్ వేర్, సీలింగ్ భూముల్లో ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. అయితే ఒకరిద్దరు ప్లాట్ల యజమానులు కొందరు రాజకీయ అండదండలతో పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే ఈ అనుమతులు ఎవరిచ్చారు, ఎలా వచ్చాయన్న దానిపై స్థానికంగా పెద్ద చర్చ నడుస్తోంది.

తమకెందుకు ప ర్మిషన్లు ఇవ్వడం లేదని మరికొందరు యజమానులు మున్సిపల్ అధి కారులు గొడవకు దిగుతున్నారు. ఓ ప్లానర్ ఏకంగా కమిషనర్ తో పంచాయతీకి సైతం దిగడం గమనార్హం.ఇక, మున్సిపాలిటీలో నిర్మితమవుతున్న పలు కమర్షియల్ షెడ్ల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కువైందన్న గుసగుసలు వినబడుతున్నాయి.

తమకు ముడు పులు అందితే ఒకరకంగా, అందకపోతే మ రోకంగా అంటూ నేతలు వ్యవహరిస్తున్నార న్న ఆరోపణలున్నాయి. ముడుపులు అందితే తమదే ఈ నిర్మాణం అని మున్సిపల్ అధికారులను, ఇతరత్రా వ్యక్తులను ప్రలోభపెడు తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శివాజీ విగ్ర హం దగ్గర నిర్మించిన ఓ కమర్షియల్ నిర్మాణం విషయంలో ఇదే తంతు జరిగినట్లు చెబుతున్నారు.

ఏది ఏమైనా మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసినా మాజీలదే పెత్తనం అన్నట్లు సాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పేరును బహిరంగంగా వాడుకుంటూ అందినకాడికి దండుకుంటున్నా ఎవరూ నోరు మెదపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీపై దృష్టిపెట్టాలని పలువురు కోరుతున్నారు.

  అమరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌మున్సిపాలిటీలో నిబంధనల మేరకే అనుమతులు ఇస్తున్నాం. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. కమర్షియల్ షెడ్ల విషయం నా దృష్టిలో ఉంది. మున్సిపల్ సిబ్బందిపై ఆరోపణలు వస్తే ఉపేక్షించబోము.