12-05-2025 12:47:24 AM
నాగర్ కర్నూల్ మే 11 (విజయక్రాంతి:) నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆసుపత్రి వర్గం పూర్తిగా వైఫల్యం చెందుతుంది. కనీస వసతులు, నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్ల క్ష్యం వహిస్తున్న పరిస్థితి ఏర్పడింది. శ్రీ సత్య సాయి సేవ ట్రస్ట్ పైనే ఆధారపడి రూపాయలకు లీటర్ చొప్పున నీటిని కొనుక్కొని తాగే పరిస్థితి రోగులకు ఏర్పడింది.
కనీసం మరుగుదొడ్లు మూత్రశాలలు శుచిశుభ్రత పాటిం చకపోవడంతో రోగులు రోగి బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి. జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి భా రీగా పెరగడంతో వాహనాల రద్దీ కూడా భా రీగా పెరిగింది. వాటిని పార్కింగ్ ఏర్పాటు చేయడంలోనూ పూర్తిగా విఫలం చెందుతున్నారు.
గైనిక్ ఓపి ప్రసూతి వార్డు సాధారణ ప్రసవాల వార్డు, డయాలసిస్ వార్డు, రక్త మూత్ర పరీక్షల సేకరణ గది సంబంధించిన మూత్రశాలలు మరుగుదొడ్లు పూర్తిగా ము క్కుపుటాలు అదిరేలా దుర్వాసన వెదజల్లడంతో రోగులు కొత్త రోగం కొనితెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని మరుగుదొడ్లకు మూత్రశాలలకు తలుపులు కూడా సక్ర మంగా ఏర్పాటు చేయలేదని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రసూతి అనంతరం పై అంతస్తులోకి షిఫ్ట్ చేశాక అందులో మరు గుదొడ్లు మూత్రశాలలు సక్రమంగా లేకపోవడంతో ఆపరేషన్ చేసుకున్న బాలింతలు కూడా కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరొకరి సహాయా న్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తమ భర్తలు లేదా అత్తమామలు మోసుకెళ్లి కాలకృత్యాలు తీర్చాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విషయాలపై పలుమార్లు ఆసుపత్రి సూ పర్నెంట్ రచ్చ రఘు దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరిస్తాం అంటూ షరామామూలుగా జవాబు అందుతోంది కానీ ఎలాంటి ఫలి తం దొరకడం లేదని రోగులు మండిపడుతున్నారు.
మందుల కొనుగోళ్లలోనూ గోల్మాల్.!
గత కొంతకాలంగా నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి ప్రభుత్వం సరఫరా చేసే మందులతో పాటు ఇతర రోగాలు ఆధారంగా బై హ్యాండ్ సప్లై పేరుతో ఇతర మందులను ఎలాంటి టెం డర్లు లేకుండానే కొనుగోలు చేసి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువేత్తాయి. ఈ నేప థ్యంలో ఈమధ్య టెండర్ ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చారు.
కానీ అక్కడ కూడా తెరవెనక ఇతరులను టెండర్లు పాల్గొనకుం డా కొంతమంది దళారులు చక్రం తిప్పినట్లు ఆరోపణలు, వాటిపై ఫిర్యాదులు కూడా రావడంతో మరోసారి రీ టెండర్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే టెండర్లు వేసినట్లు తెలుస్తోంది.
ఫర్నిచర్ కొనుగోళ్లలో అవకతవకలు..!
రోగుల సౌకర్యార్థం కుర్చీలు బల్లలు ఇతర వార్డుల్లో పరికరాలు కొనుగోలు ప్రక్రియలోనూ ఎలాంటి ప్రభుత్వ నిబంధనలను పాటించ లేదని ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. నాసిరకమైన డి గ్రేడ్ పరికరాలను కొనుగోలు చేసినట్లు కేవలం రెండు నెలల్లోనే కుర్చీలు ధ్వంసం కావడంతో అక్రమా లపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
ఆరోగ్యశ్రీ నిధుల్లోనూ భారీగా గోల్మాల్ జరిగినట్లు పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు కూ డా పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత బిఆర్‌ఎస్ పదేళ్ల కాలంలోనూ అనేక అక్రమాలు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యం లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులైనా జనరల్ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చే యకుండా అలసత్వం వహిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిరుపేదలకు వైద్యం అందించే క్రమంలోనూ సిబ్బంది, వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గత రాత్రి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశా రు..
తరచూ ఇలాంటి విషయాలపై వార్తా కథనాలు ప్రచురితం అవుతున్న నేపథ్యంలో ఆసుపత్రి సూపర్డెంట్ మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదంటూ ఆంక్షలు విధి స్తూ సర్కులర్ జారీ చేయడం పట్ల అనుమానాలకు బలం చేకూర్తోందని చర్చించు కుంటున్నారు. ఇదే విషయాలపై ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ రచ్చ రఘును వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబా టులోకి రాలేదు.