01-11-2025 08:08:04 PM
టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సి వెంకటయ్య
మిడ్జిల్: అక్రమ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని టి ఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు సి వెంకటయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... దీర్ఘకాలికంగా బీఈడీ కళాశాల డైట్ కళాశాలలకు అదేవిధంగా మెడికల్ మెడికల్ గ్రౌండ్స్ పేరుతో జిల్లా వ్యాప్తంగా అక్రమ డిప్యూటేషన్ల బదిలీలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వారు మండిపడ్డారు.
డిఇఓ గత మంగళవారం ఐదు మందికి డిప్యూటేషన్ల ఉత్తర్వులు ఇచ్చారని గతంలోనే బిఈడి డైట్ కళాశాలలకు మరికొంతమందికి డిప్యూటేషన్లు ఇచ్చారని మౌలిక ఆదేశాలతో మరికొంతమంది డిప్యూటేషన్లో పనిచేస్తున్నారని పని అడ్జస్ట్మెంట్ లో కూడా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాకుండా ఉపాధ్యాయుల స్వార్థం కోసం వారికి అనుకూలమైన ప్లేస్ లకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారని వారన్నారు. మానవత వాద హృదయంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఉపాధ్యాయులకు మేలు చేయాల్సింది పోయి ఆ ముసుగులో అక్రమార్కులకు డిప్యూటేషన్ బదిలీలను ఇస్తున్నారని వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని లేనియెడల డిఈఓ అక్రమ చర్యలపై ఆందోళన చేపడుతామన్నారు.