02-12-2025 07:52:18 PM
కొల్చారం (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుంది. ఒక్క ట్రాక్టర్ తో అనుమతి తీసుకొని ఇష్టానుసారంగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి మంజీరా నది నుండి అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఒక ట్రాక్టర్ కు అనుమతి తీసుకొని 5, 6 ట్రాక్టర్లు అదనంగా ఏర్పాటు చేసుకొని ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.