02-12-2025 07:48:55 PM
ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో మేకలు అమ్మానని చెప్తున్నా అభ్యర్థి
కామారెడ్డి జిల్లా ఎండ్రియాల్లో ఓ మేకల యజమాని సర్పంచిగా పోటీకి నామినేషన్
కామారెడ్డి (విజయక్రాంతి): సర్పంచ్ గా పోటీ చేసి ప్రజాసేవ చేయాలని భావించిన ఓ మేకల యజమాని తనకున్న మేకలలో 10 మేకలను అమ్మి వేసి సర్పంచ్ గా నామినేషన్ వేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం ఎండ్రియాల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. తమ సొంత గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి ప్రజా సేవ చేయాలని కలలు కన్నా మేకల కాపరి గంగయ్య తనకున్న మేకలలో 10 మేకలను అమ్మకానికి పెట్టాడు. మేకలను అమ్మగా 50,000 రూపాయలు వచ్చాయి. తన అనుచరులతో కలిసి మంగళవారం సర్పంచ్ అభ్యర్థిగా గంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. తనతో పాటు వార్డు సభ్యులను బలపరచడానికి ఆఫీడవిట్లకు కూడా కూడా ఆయనే ఖర్చు పెట్టుకున్నారు.
నామినేషన్ల కోసం డబ్బులు గంగయ్య చెల్లించారు. ఒకవైపు గంగయ్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ప్రజాసేవ చేయాలని సంకల్పంతో పది మేకలను అమ్మగా 50 వేల రూపాయలు వచ్చాయని వాటితో సర్పంచ్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేయడంతో పాటు తనకు మద్దతుగా ఉన్న వార్డు సభ్యులకు ఆఫీ డేవిట్లాకోసం అయినా ఖర్చులు కూడా గంగయ్య భరించాడు. ప్రజా సేవ చేయాలనే సంకల్పం గంగయ్య చెందిన పది మేకలను అమ్మి వేసి సర్పంచ్ అభ్యర్థిగా గ్రామంలో పోటీ చేస్తున్నారు.
తాను నిస్వార్ధంగా పనిచేసే గ్రామస్తులకు సేవ చేస్తానని ఈ సందర్భంగా గంగయ్య విజయ క్రాంతి ప్రతి నీది తో తెలిపారు. గంగయ్య కు గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో గంగయ్య సంకల్పం నెరవేరుతుందా లేదా ఎన్నికల తర్వాత తెలియనుంది. గ్రామస్తులు గంగయ్య కు మద్దతిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఆయన సంకల్పం గొప్పదే అయిన గ్రామస్తులు సర్పంచ్ గా గెలిపించి గ్రామస్తులు గంగయ్య సంకల్పానికి మద్దతు ఇస్తారా లేదా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం గంగయ్య మాత్రం తనకు గ్రామస్తుల మద్దతు ఉందని తనకు రిజర్వేషన్ అవకాశం కలిసి వచ్చిందని అందుకే పోటీలో ఉన్నానని తెలిపారు. తన గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల మద్దతు కూడా కట్టుకొని సర్పంచ్ గా గెలిచి తీరుతానని గంగయ్య భరోసాతో చెబుతున్నారు.