calender_icon.png 5 August, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల రక్షణ చట్టాలపై అవగాహన

05-08-2025 08:59:11 PM

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ విద్యార్థినులకు మహిళల రక్షణ చట్టాలు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై హుస్నాబాద్ పోలీసులు అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థి దశ చాలా కీలకమైనదని, చదువుపై మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాను అవసరమైన మేరకే వాడాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపించే లింకులను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.

సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని సూచించారు. షీటీమ్ బృందం సభ్యులు ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. ఎవరైనా వేధించినా, వెంబడించినా వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట షీటీమ్ నంబర్ 8712667434కి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మమత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.