తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి
06-08-2026 07:25 PM
ఐసిడిఎస్ సూపర్వైజర్ రజని
సత్తుపల్లి,(విజయక్రాంతి): తల్లిపాలలో పోషక విలువలు మెండుగా ఉంటాయని, తల్లిపాలు తాగిన పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని,వ్యాధులు దరి చేరవని ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిని అన్నారు. గురువారం మండల పరిధిలోని యాతాలకుంట గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై, అనంతరం మాట్లాడుతూ తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు, చురుకుదనం అధికంగా ఉంటాయని అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లి బిడ్డ అనుబంధాన్ని, తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అంగన్వాడి టీచర్లు గీసిన చిత్రం గురించి తెలియజేస్తూ సమావేశానికి వచ్చిన గర్భిణీలు, బాలింతలు,తల్లులు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు.






