calender_icon.png 5 July, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

05-07-2025 01:03:55 AM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

ములుగు జులై4 (విజయ క్రాంతి): ములుగు జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల రోజుల (జూలై 4వ తేది నుండి 31 వరకు)పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు,నిరసనలు,ర్యాలిలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు,సమావేశాలు నిర్వహించరాదని అన్నారు.

బందుల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పి సూచించారు. కావున శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు