05-07-2025 01:02:37 AM
చిట్యాల, జులై 4(విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని జూకల్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల విద్యార్థిని ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో జూలై 2న అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరిగినట్లు తెలిపారు.
ఇందులో జూకల్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ఆరవ తరగతి విద్యార్థిని అన్నం రిషిత అండర్12 బాలికల విభాగంలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైందనీ వివరించారు.రిషిత జూలై 6న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో భూపాలపల్లి జిల్లా తరఫున పాల్గొనడం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన రిషితను , గైడ్ వ్యాయామ ఉపాధ్యాయుడు గాజర్ల శ్రీనివాసులను అభినందించారు.