05-07-2025 01:03:58 AM
కేంద్ర మంత్రి బండి
రాజన్న సిరిసిల్ల, జూలై 4 (విజయక్రాంతి): “సామాజిక న్యాయం అంటూ సభలు పెట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదు. ఒక్కసారైనా బీసీని ప్రధాని, సీఎం చేశారా? ఈ సభ పేరు సామాజిక అన్యాయ సమర భేరీగా పెడితే బాగుండేది” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మరిమడ్లలో ఏకలవ్య మోడల్ పాఠశాల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాప న చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 ఏండ్లు పాలించి ఒక్క బీసీని సీఎం చేయలేదన్నారు.