calender_icon.png 30 January, 2026 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య యొక్క ప్రాముఖ్యత..

28-01-2026 12:00:00 AM

చతస్ర ఏవ విద్యా.. తాభిర్ధర్మార్థౌ

యద్ విద్యాత్ తత్ 

విద్యానాం విద్యాత్వమ్!

అన్వీక్షికీ, త్రయీ వార్తా దండనీతిశ్చేతి.. అనగా అన్వీక్షికి (పదార్ధాల స్వరూపాన్ని ఉపాయాల చేత, హేతువుచేత పరీక్షించే విద్యను అనీక్షికి అంటారు), త్ర యి.. ఋగ్యజుస్సామ వేదాలు, వార్తా అన గా కృషి (వ్యవసాయం), పశుపోషణ, వర్త కం, దండనీతి అనగా రాజనీతి ఈ నాలు గు విద్యలే విద్యలు అంటాడు, ఆచార్య చాణక్య. ఏ విషయాన్నునా తెలుసుకునే సా ధనాన్ని విద్య అంటారు. అన్వీక్షికీలో లోకరీతి, వేదత్రయంలో ధర్మాధర్మాలు, వార్త లో లాభనష్టాలు, దండనీతిలో నీతి అవినీతి అంశాలు వివరించబడ్డాయి. అన్వీక్షికి ఉపాయాలచేత, ఆయా విద్యల్లో బలాబలాలను పరీక్షించి ప్రపంచానికి ఉపకారం చేస్తుంది. వ్యక్తి అభ్యున్నతి మార్గంలో నడుస్తున్న సమయంలో బుద్ధిని నిలకడగా ఉండేందుకు అన్వీక్షికి ఉపకరిస్తుంది.

అలా గే వ్యసనశీలుడయ్యే సమయంలో హెచ్చరిస్తుంది. వ్యక్తిలోని ప్రజ్ఞావైశారద్యాన్ని అనగా బుద్ధిలోనూ, ఆలోచనలోనూ సమర్ధతను, పరిణతిని పెంచుతుంది. అలాగే మాటలలో నేర్పునూ, పనుల్లో నైపుణ్యంతో కూడిన సమర్ధతను పెంచుతుంది. అన్వీక్షికి అన్ని విద్యలకూ దీపంలాంటిదని, అన్ని కర్మలను సునాయాసంగా నిర్వహించే నైపుణ్యానికి ప్రతీక అని, సకల ధర్మాలకు ఆశ్రయమని పెద్దలు చెపుతారు.

తూర్పున ఉదయించి..

విద్యవేరు అక్షరాస్యత వేరు. విద్య నా లుగు గోడల మధ్య నేర్చుకునేది కాదు. లో కం తీరును పరిశీలించడమే నిజమైన చదు వు. విద్య సమత్వాన్ని దర్శింపచేస్తుంది. ఉదాహరణకు గాలి ఉద్యానవనం నుంచి వచ్చే సౌగంధ్యాన్ని, శీతల ప్రదేశాల్లోని చల్ల ని గాలిని, మురికి గుంటలో నుంచి లేదా కుళ్ళిపోయిన జంతువుల నుంచి వచ్చే దు ర్గంధాన్ని మోసుకువస్తుంది. తన పర భేదంలేదు.. కర్తవ్య నిష్ఠతప్ప ఉఛ్ఛనీచాలనే భావనా లేదు. విద్య వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది. చిన్నదైనా పెద్దదైనా చేసే పనిని గౌరవించే వైఖరిని ఇస్తుంది. ప్రాజ్ఞతను పెంచుతుంది. విద్యకు జ్ఞానానికి ప్రతీకయై న సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి మెప్పుకోసమో ఎదురుచూడడు. తన కర్తవ్యాన్ని భగవదుపాసనగా భావిస్తూ.. ముందుకు సాగుతాడు. ఒక్కసారి పరిశీలనా దృష్టితో సూర్యుని ఉదయాస్తమయాలను పరిశీలిస్తే.. మన జీవితాలకు చక్కని ప్రబోధగా కనిపిస్తుంది.

సమయ పాలన..

క్రమశిక్షణ.. ఎన్ని అవాంతరాలు ఎదురై నా సమయానికి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఒక్క నిమిషమైనా ఆలస్యం గా ఉదయిద్దామనో లేదా కాస్తా ముందు గా అస్తమిద్దామనో ఆలోచన తనకు ఉం డదు. ఈ సమయ పాలనయే జీవన వైఖరి గా ఒక అలవాటుగా సూర్యుని గమనంలో ప్రతిబింబిస్తుంది. జీవితమనే నదీ ప్రవా హం సాఫీగా సాగాలంటే సరైన వైఖరి, క్రమశిక్షణ అనే రెండు దారులు పటిష్టంగా ఉండాలి. సూర్యుని నుంచి ఆస కారాత్మక వైఖరి, క్రమశిక్షణలను నేర్చుకోవాలి. 

విజ్ఞాన తేజస్సు..

ప్రశాంతత.. కలిగిన దానిని ఇతరులకు సమర్పించడంలో కలిగే ఆనందం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సూర్యుడు ప్రపంచానికి వెలుగులు పంచుతున్నాడు. తనకున్న దానిని అందరికీ పంచుతూ అం దులో ఆనందించడం వల్ల తాను తేజోవంతుడౌతూ జగత్తుకు ‘విజ్ఞాన తేజస్సు’ను అందిస్తున్నాడు. ‘సమర్పణ’లోనే దివ్యత్వాన్ని పొందగలమనే శాశ్వత సత్యాన్ని సూర్యుడు ఈ జగతికి చెబుతున్నాడు. స మభావన.. కర్తవ్య నిష్ఠతో సాగే సూర్య కిరణాలు దేవాలయంపై ప్రసరిస్తాయి. అలా గే అశుద్ధ ప్రదేశంపై ప్రసరిస్తాయి. ఒకటి ఎక్కువదనో మరొకటి తక్కువదనో సూ ర్యుడు భావించడు. సమభావనతో సాగిపోవడం అతని లక్షణం. అన్నింటిలోనూ తామున్నా దేనికీ అతుక్కు పోకూడదనే మానసిక స్థితిని సంతరించుకోమని సూర్య కిరణాలు ప్రబోధిస్తున్నాయి.  

కిరణాల ద్వారా జ్ఞానం..

పరిమితులు లేని ప్రేమ.. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. జ్ఞానాన్ని అందరికీ కిరణా ల ద్వారా పంచుతున్నాడు. చీకటి అజ్ఞానం కాగా ఆ అజ్ఞానాంధకారం తొలిగేందుకు సూర్యుడు అవసరమైన జ్ఞానమనే వెలుగునిస్తున్నాడు. అందులో బీదా బిక్కి, ధనవం తుడు దరిద్రుడనే భేద భావం లేకుండా తన ప్రేమను అందరికీ పంచుతాడు. పనిని ప్రేమించే తత్వం.. కొందరు చేసే పనిని భారంగా పరిగణిస్తారు. మరికొందరు కర్తవ్యంగా నిర్వహిస్తారు. కొందరు మాత్రమే; దానిని భగవదారాధనా భావనతో ఉపాసిస్తారు. ఆ క్రమంలో వారే ఫలితాన్ని ఆశిం చరు. కాకపోతే నిండు మనస్సుతో వారు చేసే ఉపాసన వారికి తెలియకుండానే సత్ఫలితాన్ని ఇస్తుంది. సూర్యుడు కూడా అలాంటి ఉపాసనా భావంతో తన పనిని నిర్వహిస్తుంటాడు.

వృద్ధికి అవరోధం..

ప్రతి ఉదయాన్ని ఉత్సాహంగా, ఆనందంగా ఆహ్వానించడం.. ఎండ వేడిమిని తాళ లేక ఎవరు తనను దూషించినా, భూ షించినా సూర్య కిరణాలు బాధపడవు, హర్షించవు. ప్రతి ఉదయం మనకు భగవద్దత్తమైన వరం. దానిని ఆస్వాదించడం ఆనందించడం విజయమార్గాన్ని మనకు దర్శింప చేస్తుంది. ఈ క్రమంలో ఎదుటి వారి విమర్శలను పట్టించుకోవడం అవరోధంగా మారుతుంది. మన మెంత మంచి చేసినా కొందరు దానిలో రంధ్రాన్వేషణ చేసేందుకు చూస్తూనే ఉంటారు. వారి వి మర్శలకు విలువనిస్తే మనం అపజయం పాలయినట్లే. నిజాయితీగా మనల్ని మనం బేరీజు వేసుకోవడం, అవసరమైన రీతిలో ఆత్మ విమర్శ చేసుకోవడం, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఎదుటి వారి ఆలో చన ప్రకారం ఎవరూ జీవించలేరు. నిరుత్సాహ పరచే ఎదుటి వారి విమర్శలను పట్టించుకోవద్దు. అలాగే పొగడ్తలకు పొంగి పోవద్దు. ఈ రెండూ మన అభివృద్ధికి నిరోధకాలే. 

మృత్యువు జయిస్తేనే..

నిర్భయత.. అన్నింటి కన్నా మనిషి భ యపడేది మృత్యువుకు. ఆ మృత్యువు ను జయించిన వాడు సూర్యుడు. జయించ డం అంటే దానిని సంపూర్ణంగా అవగాహ న చేసుకోవడమే. ఆ అవగాహన జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. ఆ జ్ఞానానికి ప్రతీకయే సూర్యుడు. ఆకృతి కలిగిన పదార్ధం ఒకనాడు ఆకృతి ప్రయోజ నం పూర్తయ్యాక ఆకృతిని కోల్పోతుందనే జ్ఞా నం సంపూర్ణంగా అవగతం అయ్యాక మృ త్యువు ఏనాడూ ఎవరినీ భయపెట్టదు. ఆ స్థితిని సాధించిన వాడు సూర్యుడు. విద్య వల్ల పొందిన జ్ఞానమే సూర్యునికి అలాం టి ఉదాత్తమైన మానసిక స్థితిని ఇచ్చింది. అలాంటి మనో వికాసాన్ని సంతరించుకొ ని మనమూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కి ఎదగాలని నిరంతరం పరిశ్రమిద్దాము.

పాలకుర్తి రామమూర్తి