28-01-2026 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘మేక్ అమెరికా గ్రేట్ ఎ గైన్’ అనే భావనతో ఏకధ్రువ ప్రపంచంగా అమెరికా చెలామణి అవ్వాలనే తపనతో తన, పర అనే భేదం లేకుండా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలపై అదనపు సుంకాలను విధించారు. ట్రంప్ తన చర్యలతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే స్తూనే, అదే సమయంలో తన సొంత దే శంలోని ప్రజల మనస్సులో శత్రువుగా పే రును ముద్రించుకుంటూ అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నారు. ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తున్న యూరోపియన్ యూనియ న్ (ఈయూ), నాటో కూటమి దేశాలు మె ళ్లిగా అమెరికాకు దూరమవుతూ వస్తున్నా యి.
దాదాపు ఎన్నో దశాబ్దాలుగా భారత్ తో ఉన్న వాణిజ్య సంబంధాలను చెరిపేసేలా అదనపు సుంకాలు విధిస్తూ అమెరి కా మనల్ని కూడా దూరం చేసుకుంటుందనడంలో అతిశయోక్తి లేదు. అయితే అమె రికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ జరిగి పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నప్పటికీ ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలు ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. పైగా భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగకుండా ట్రంప్ సహా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆర్థిక సలహాదారు పీటర్ నవారో అడ్డుకున్నారని అధికార రిపబ్లికన్ పార్టీ సెనెటర్ టెడ్ క్రజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం సంబంధాలను మరింత క్షీణించే లా చేసినట్లయింది.
ఇటువంటి పరిస్థితుల్లో మన పాలకులకు జ్ఞానోదయం కావడమనేది అభినందించాల్సిన అంశం. అమెరికాతో అంటకాగడం ఎప్పటికైనా ప్ర మాదం అని గ్రహించిన భారత్, ప్రపంచంలోని చిన్న దేశాలు నుంచి ఆర్థికంగా అభి వృద్ధి చెందిన దేశాలతో వరుసగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) చేసుకుం టూ వస్తున్నది. ఇందులో భాగంగానే గతేడాది బ్రిటన్‌తో ఎఫ్‌టీఏ ఖరారు జరిగింది. ఇటీవల యుఏఈతో దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. తాజాగా భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కూటమి మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం ముదావహం.
కీలక మలుపు..
ఇటీవల ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఆ ధ్వర్యంలో దావోస్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఈయూ కమిషన్ అధ్యక్షురా లు ఉర్సులా వాన్‌డెర్ లెయాన్ త్వరలో భారత్,- ఈయూ మధ్య జరగబోయే అతి పెద్ద వాణిజ్య ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆ ల్ డీల్స్’ గా ప్రకటించి, అమెరికాతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడేట్టుగా చేశారు. ‘ఎవ డు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో’ అనే విధంగా ఉర్సులా చేసిన ఈ ప్రకటన అమెరికాకు నేరుగా తగిలిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉర్సులా తాను చేసిన ప్రకటనను వాస్తవరూపం లో అమలు చేయడానికి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి భారత్‌లో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వి చ్చేసి ఇచ్చిన మాట ప్రకారం అతిపెద్ద స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) చేసుకున్నారు. 27 దేశాలకు సంబంధించిన ఈ యూ కూటమి.. భారత్‌కు మేలు కలిగించే దాదాపు 90 వస్తువులపై దిగుమతి సుం కాలు తగ్గించుకునే స్వేచ్ఛా వాణిజ్యంపై ఒప్పందం జరుపుకోవడం ప్రపంచ వాణి జ్య సంబంధాల్లో కీలక మలుపు అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా భారతదేశం నుంచి ఈయూ దేశాలకు ఎ గుమతి అయ్యే దుస్తులు, తోలు, పాదరక్ష లు, నగలు, ఫార్మా వంటి రంగాలకు భవిష్యత్తులో భారీ స్థాయిలో మంచి మార్కెట్ లభించనుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. పరిశ్రమలకు ప్రోత్సాహం ల భించడంతో పాటు ఇరు దేశాల మధ్య టె క్నాలజీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఈ స్వే చ్ఛా వాణిజ్య ఒప్పం దం వల్ల మన దేశానికి ఈయూ దేశాల నుంచి దిగుమతి అ య్యే కార్లు, వైన్ చౌకగా లభించే అవకాశముంది.. ఇప్పుడు ఈయూ దిగుమతు లుపై మనం వేసే దిగుమతి సుంకం 110 నుంచి 40 శాతానికి దిగివస్తుంది.
200 కోట్ల జనాభాకు లబ్ధి
భారత్, ఈయూ కూటమి మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా దాదాపు ప్రపంచంలోని 200 కోట్ల జనాభాకు లబ్ధి కలిగే అవకాశముండడం హర్ష నీయం. ముఖ్యంగా ప్రపంచ జీడీపీలో నాలుగోవంతు (25 శాతం) మేర ఈ ఒ ప్పందం ప్రభావం చూపనుంది. ఒక చెడు కూడా మంచికే అన్నట్టు, ట్రంప్ టారిఫ్‌లు కూడా మనతో పాటు ప్రపంచలోని ఇతర దేశాలకు కనువిప్పు కలిగేలా చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం యూర ప్ దేశాలు అన్ని దాదాపు వృద్ధ జనాభాతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో మన దేశ జనాభా ప్రపంచంలోనే అధికంగా ఉన్నప్పటికీ యువతతో కళకళలాడుతూ కనిపిస్తున్నది.
ఈ పరిస్థితిల్లో రాబోయే దశాబ్ధాల్లో ఈ యూ దేశాలకు అతిపెద్ద వాణిజ్య మార్కెట్‌గా భారత్ కనిపించడం అనేది ఎడారిలో ఒయాసిస్‌లాగా అనిపిస్తున్నది. భారత్‌లో మధ్య తరగతి వర్గం, యువతకు ఆదా యం పెరగడం, కొనుగోలు శక్తి పెరగడంతో యూరప్ దేశాలకు ఇండియా అతి పెద్ద వాణిజ్య మార్కెట్ గా ఉంటుంది. మన దేశానికి చెందిన పెట్టుబడులు, సాం కేతికత భారీ స్థాయిలో ఇతర దేశాలకు సంబంధించిన మార్కెట్‌లో ప్రవేశించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశముంది.
వికసిత భారత్..
భారత్, ఈయూ కూటమి మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఉభయకుశలోపరి. ప్రపంచ వాణిజ్యానికి భారత్ వెలు గురేఖగా నిలవబోతుందనడంలో సందే హం లేదు. ఈ ఒప్పందం ఇటు భారత్‌ను.. అటు ఈయూను పెద్ద మార్కెట్‌గా తయారయ్యేలా చేయడంతో పాటు అమెరికాకు ధీటుగా జవాబు చెప్పగల శక్తిగా రూపాంతరం చెందింది. ట్రంప్ దుందుడుకు చర్య లకు ఇది చెంపపెట్టు లాంటిది. రూపాయి- మధ్య వాణిజ్యం జరిగితే ఇరు ఆర్థిక వ్యవస్థలు బలపడడంతో పాటు డీ డాలరైజేషన్ జరగడం వల్ల అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇండియా- మిడిల్ ఈస్ట్ -యూరప్ ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు జరిగి, సమయం, ఇంధనం ఆదా అవుతుంది. రవాణా ఖర్చులు తగ్గి వ స్తువులు ధరలు తగ్గుముఖం పడి, మార్కె ట్ బలపడుతుంది. స్టాఫ్ పవర్ గా భాసిల్లే భారత్ తన వాణిజ్య ఒప్పందాలు ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా 2047 భారత్ లక్ష్యం చేరుకోవడానికి మరిం త చేరువవుతుంది.
వజ్రాయుధంలా..
భారత్ మధ్య ఈ ఎఫ్‌టీఏ అ ధికారికంగా కుదిరినప్పటికీ తక్షణ అమలు మాత్రం సాధ్యం కాదు. ట్రేడ్ డీల్‌కు సం బంధించిన న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకునేందుకు దాదాపు ఒక ఆరు నెలల సమయం పట్టొచ్చని విశ్లేషకు లు భావిస్తున్నారు. ఒకవేళ ఒప్పందం అమల్లోకి వస్తే మన దేశం నుంచి 84 శాతం ఎగుమతులు ఈయూ దేశాలకు వెళ్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మనదేశంలో పారిశ్రామిక రంగం బలోపేతం కావడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ముఖ్యం గా విదేశీ మారక ద్రవ్యం మనకు లభ్యం అవుతుంది. రూపాయి విలువ పతనం కాకుండా ఉండేందుకు దోహదం చేస్తుంది.
అదే సమయంలో మనదేశం నుంచి వెళ్లే ఎగుమతులు నాణ్యత కలిగి ఉండాలి.. లేదంటే 15 సంవత్సరాల నుంచి ప్రయ త్నం చేసి సాధించిన భారత్ ఈయూ ఎఫ్‌టీఏ ఒప్పందం గాలిలో దీపంలా అడుగంటి పోతుందని మన పాలకులు గ్రహిం చాలి. ముఖ్యంగా కార్బన్ ట్యాక్స్ పై సరైన అవగాహన కలిగి ఉండాలి. అదే సమయంలో భవిష్యత్తులో ట్రంప్ ఆడే నాటకా ల్లో ఈయూ దేశాలు జారిపోకుండా ఒక కంట కనిపెట్టడం మన బాధ్యత అని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా అమెరికా టారిఫ్‌ల నుంచి బయటపడటానికి, ట్రంప్ ఏకపక్ష నియంత్రృత్వ విధానాలను అడ్డుకునేందుకు భారత్, ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక వజ్రాయుధం లాంటిదనడంలో సందేహం లేదు.
వ్యాసకర్త సెల్: 9390509791
ఐ ప్రసాదరావు