calender_icon.png 5 August, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియా ఎరువులతో నేల ఆరోగ్యం మెరుగు

05-08-2025 08:39:42 PM

చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు భానోత్ ప్రసాద్

మందమర్రి,(విజయక్రాంతి): రైతులు నానో యూరియా ఎరువులను వాడటం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగు పడుతుందని  వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు భానోత్ ప్రసాద్ అన్నారు. మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో మంగళ వారం వ్యవసాయ శాఖ, ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ సంయుక్తంగా పత్తి క్షేత్రాలలో నానో యూరియా, డీఏపి ఎరువుల పిచికారిపై రైతులకు డ్రోన్ పరికరంతో క్షేత్ర ప్రదర్శన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రైతులు నానో యూరియా, నానో డీఏపి ఎరువుల వినియోగంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి, నాణ్యతను మెరుగు పరుస్తుందని, గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తుందన్నారు. నానో ఎరువులను బయోస్టిమ్యులెంట్స్, ఇతర వ్యవసాయ రసాయనాలతో కలపవచ్చని, నానో డీఏపి ద్రావణం తో విత్తన శుద్ది వల్ల మెరుగైన అంకురోత్పత్తికి, విస్తృతమైన వేరు పెరుగు దలకు దారి తీస్తుందని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందని,ఎరువులను నిల్వ చేయడం, రవాణా చేయడం సులభమవుతుందన్నారు.