05-08-2025 08:36:00 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళగా, తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఇంట్లోని బీరువాను పగలగొట్టి అందులో దాచిన తులంన్నర బంగారం, 23 తులాల వెండి నగలు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. సంఘటన స్థలిని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇటీవల మానుకోట పట్టణం, పరిసర ప్రాంతాల్లో దొంగతనాల జోరు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు.