15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వెబ్‌కాస్టింగ్‌లో ఓటింగ్ సరళి పరిశీలన

15-12-2025 12:00 AM

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ 

నస్పూర్, డిసెంబర్ 14 : జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెం డవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను కలెక్టరేట్ లో అదనపు ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి జిల్లా ఎన్ని కల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ రెండవ విడతలో జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నేపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్, వేమనపల్లి మండలాలలో సర్పం చ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌం టింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభా గం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.