calender_icon.png 25 October, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫౌజీ’లో

25-10-2025 12:11:43 AM

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా ‘ఫౌజీ’. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గురువారం అధికారికంగా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ భారీ ప్రాజెక్ట్ వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

ఈ సినిమాలో కన్నడ సింగర్, నటి చైత్ర జే ఆచార్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. ‘హను రాఘవపూడి అద్భుతమైన క్రియేషన్‌లో భాగం కావడం ఎంతో గర్వంగా ఉంది. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్‌తో పనిచేయడం జీవితంలో మరపురాని అవకాశం’ అని పేర్కొంది చైత్ర జే ఆచార్. ఈ బ్యూటీ గతంలో ‘సప్తసాగరాలు దాటి’, ‘టోబీ’, ‘బ్లింక్’, ‘3బీహెచ్‌కే’ చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది.