25-10-2025 12:10:33 AM
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక ‘థామ్మా’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలోని ‘తుమ్ మేరీ నా హుయే..’ పాటలో రష్మిక తనదైన స్టెప్పులతో అదరగొట్టింది. తాజాగా రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “జనవరిలో జిమ్ చేస్తుం డగా కాలు ఫ్యాక్చరైంది. వైద్యులు మూణ్నెల్లు విశ్రాంతి తీసుకోమన్నారు. అప్పుడు ‘ఛావా’ ప్రమో షన్స్. 30 రోజులు తిరుగుతూనే ఉన్నా.
కాలు వాచి, నొప్పి తీవ్రం కావటంతో మళ్లీ వెళితే డాక్టర్ నన్ను మందలించారు. కానీ, అప్పటికే సాంగ్‌కు సంబంధించి షూటింగ్ షెడ్యూల్ ఖరారైంది. నొప్పితోనే సాంగ్ పూర్తి చేశా. ఇప్పుడు ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తుంటే, అప్పటి బాధ అంత పెద్దదనిపించడంలేదు. నేను ఏది చేసినా ప్రేక్షకుల ఆనందం కోసమే చేస్తా” అని తెలిపింది.